* Song:-"ఏలా ఉండగలను నీ ప్రేమ లేకుండా"

Jul 11, 2016, 06:30 PM

  • Song:-"ఏలా ఉండగలను నీ ప్రేమ లేకుండా" ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • ఏలా ఉండగలను నీ ప్రేమ లేకుండా ఏలా ఉండగలను నీ శాంతి లేకుండా ఏలా నడువగలను ఏలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా. . . .!!2!! నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమ వివరించలేనిది నీ ప్రేమ మరచిపోలేనిది నీ ప్రేమ విడిచిపోలేనిది !! ఏలా ఉండగలను నీ ప్రేమ లేకుండా !!

  • శాశ్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావు !!2!! విడువక ఏడబాయక తోడున్నావు సర్వకాలము నాతో ఉన్నావు !!2!! నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమ వివరించలేనిది నీ ప్రేమ మరచిపోలేనిది నీ ప్రేమ విడిచిపోలేనిది

  • శ్రమలలో నన్ను విడిపోలేదు దుఖములో నన్ను ఓదార్చావు !!2!! మేలులతో నన్ను తృప్తిపరిచావు నిత్యము నన్ను నడిపించావు !!2!! నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమ వివరించలేనిది నీ ప్రేమ మరచిపోలేనిది నీ ప్రేమ విడిచిపోలేనిది

  • పాపిని నన్ను ప్రేమించావు నా కొరకు నీ ప్రాణమిచ్చావు !!2!! రక్తం చిందించి విమోచించావు నీ సోత్తుగా నన్ను చేసుకున్నావు !!2!! నీ ప్రేమ వర్ణించలేనిది నీ ప్రేమ వివరించలేనిది నీ ప్రేమ మరచిపోలేనిది నీ ప్రేమ విడిచిపోలేనిది !! ఏలా ఉండగలను నీ ప్రేమ లేకుండా !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.