* Song:- “ సింధూరమస్తకి వృక్షములారా ”

Jul 12, 2016, 05:54 PM

  • Song:- “ సింధూరమస్తకి వృక్షములారా ” ~~~~~~~~~~~~~~~~~~~~~*

  • సింధూర మస్తకి వృక్షములారా నరికివేయబడిన మొద్దులారా !!2!! దశమ భాగమే విడువబదిననూ పరిశుద్ధమైన చిగురు మొలుచును !!2!! !! సింధూర మస్తకి వృక్షములారా !!

  • పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు నరుడు కాడు !!2!! భూదిగంతముల నుండి నిన్ను రప్పించును !!2!! భూరాజుల ఎదుట నిన్ను స్థాపించును !!2!! !! సింధూర మస్తకి వృక్షములారా !!

  • ఎండిన ఎడారిని పండించు వాడు అడవిలో త్రోవను కలుగజేయువాడు !!2!! గాలివాన చేత నీవు కొట్టబడియున్నాను !!2!! నీలాంజనములతో నిన్ను కట్టును !!2!! !! సింధూర మస్తకి వృక్షములారా !!

  • నిముషమాత్రమే నిన్ను విసర్జించెను శాశ్వత కాలము నిన్ను ప్రేమించును !!2!! పర్వతములు మెట్టలు తత్తరిల్లినా !!2!! నీ దేవుని నిత్యకృప నిన్ను విడువదు !!2!! !! సింధూర మస్తకి వృక్షములారా !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.