" తెనాలి రామ కృష్ణ " లో రావు బాల సరస్వతీదేవి పాడిన " ఝణ ఝణ కంకణములు .."

Oct 26, 2015, 12:21 PM

" తెనాలి రామ కృష్ణ " లో రావు బాల సరస్వతీదేవి పాడిన " ఝణ ఝణ కంకణములు .." అనేపాటను ఆ సినిమా నుండీ తీసేశారు.. " నిండు పున్నమి- పండు వెన్నెల " అనే పుస్తకములో బాలసరస్వతీ దేవిగారిని ఉటంకిస్తూ ఇలా రాసి ఉంది

" కొన్నిసినిమా పాటలు రికార్డు అయ్యీ , చిత్రీకరణ అయ్యాక కూడా బాగులేవు అనుకుంటే తీసేస్తారు.. అయితే నా విషయములో ' అసూయ ' వలన పాటలు తీసివేయడము జరిగింది." తెనాలి రామ కృష్ణ " లో నేను పాడిన " ఝణ ఝణ కంకణములు .." అనే పాట చాలా బాగుండడము వలన ఇతరుల అసూయకు లోనై తీసివేయ బడినది..బాగా లేనందువల్ల కాదు... "

అందుకే ఆ పాట మనకు సినిమాలో కనపడదు... ఇంతవరకూ వినలేదు కూడా.. ఇప్పుడు వినండి. :D