* Song:- “ నా స్తుతులపైన నివసించువాడా ”
Share
Song:- “ నా స్తుతులపైన నివసించువాడా ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికూడా యేసయ్యా !!2!! నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే !!2!!
నను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అవి నా ఊహకే వింతైనది !!2!! ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించిచావు !!2!! !! నా స్తుతులపైన నివసించువాడా !!
ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరుపారగా నీతో మధురమైన ఫలములియ్యనా !!2!! ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి విజయుడా నీ కృపచాలును నా జీవితాన !!2!! !! నా స్తుతులపైన నివసించువాడా !!
నీతో యాత్రచేయు మర్గములు ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి !!2!! నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి పదితంతుల సితారతో నిన్నే కీర్తించెద !!2!! !! నా స్తుతులపైన నివసించువాడా !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
