* Song:- " మధురమైనది నా యేసు ప్రేమా "
Share
Song:- " మధురమైనది నా యేసు ప్రేమా " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
మధురమైనది నా యేసు ప్రేమా మరపురానిది నా తండ్రీ ప్రేమ.... !!2!! మరువలేనిదీ నా యేసు ప్రేమా మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా... ప్రేమ... ప్రేమా... నా యేసుప్రేమ !!2!! !! మధురమైనది నా యేసు ప్రేమా.... !!
ఇహ లోక ఆశలతో అంధురాలనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని !!2!! చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి !!2!! నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం ప్రేమా... ప్రేమ... ప్రేమా... నా యేసుప్రేమ !!2!! !! మధురమైనది నా యేసు ప్రేమా.... !!
నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి !!2!! మరణపు ముల్లును విరచిన దైవా !!2!! జీవమునోసగిన నీ ప్రేమ మధురం ప్రేమా... ప్రేమ... ప్రేమా... నా యేసుప్రేమ !!2!! !! మధురమైనది నా యేసు ప్రేమా.... !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
