* Song:- “ ఉన్నపాటున వచ్చు చున్నాను ”
Share
Song:- “ ఉన్నపాటున వచ్చు చున్నాను ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా యెన్న శక్యముగాని పాపము లన్ని మోపుగ వీపుపైఁబడి యున్న విదె నడలేక త్రొట్రిలు చున్నవాఁడను నన్ను దయఁగను !! ఉన్నపాటున వచ్చు చున్నాను !!
దరిలేని యానంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయును తెరవు కడ్డం బైన యన్నిటి విరగఁగొట్టేను గాన నే నిపు డరుదుగా నీ వాఁడ నవుటకు మణి నిజము నీవాఁడ నవుటకే !! ఉన్నపాటున వచ్చు చున్నాను !!
కడు భీదవాఁడ నం ధుఁడను దౌర్భాగ్యుఁడను జెడిపోయి పడియున్నాను సుడివడిన నా మదికి స్వస్థతఁ జెడిన కనులకు దృష్టి భాగ్యముఁ బడయువలసిన వన్ని నీ చేఁ బడయుటకు నా యొడ యఁడా యిదె !! ఉన్నపాటున వచ్చు చున్నాను !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
