" కాన్‌స్టేబుల్ కూతురు " లో సుశీల--అందంకోసం కన్నులు "
Share
1963 -లో వచ్చిన " కాన్‌స్టేబుల్ కూతురు " లో సుశీల , పీబీ శ్రీనివాస్ , రఘు బృందము పాడిన " అందంకోసం కన్నులు " దర్శకత్వం- తాపీ చాణక్య. రచన ఆత్రేయ , అనిసెట్టి , ఆంజనేయ శాస్త్రి లలో ఒకరు.. పాటల పుస్తకములో ఏ పాట ఎవరు రాసిందీ ఇవ్వలేదు.. కానీ " కన్నులు " పదాన్ని అమితంగా ఇష్టపడి రాసేది ఆత్రేయ గారే.
ఈ పాటను , అప్పట్లో ఇంకా హీరోయిన్ గా నిలదొక్కుకోలేని , " జయలలిత " పైన తీశారు. ఆమెకు ఇది రెండో ఐటెమ్ సాంగ్. ఇంకో సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ చేసిందని విన్నాను. [ ఈ పాటలో ప్రస్తుతము సుశీల గారి గొంతు మాత్రమే ఉంది]
