* Song:-" కన్నీరేలమ్మ కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా"
Share
Song:-" కన్నీరేలమ్మ కరుణించు యేసు " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
కన్నీరేలమ్మ. . . . కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మ. . . . కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలత మాన్పే !!2!! యేసే తోడమ్మా !! కన్నీరేలమ్మ కరుణించు యేసు !!
నీకేమి లేదని... ఏమి తేలేదని... అన్నారా నిన్ను అవమానపరిచారా తల రాత ఇంతేనని... తరువాత ఏమవునని... రేపటిని గూర్చి చింతించుచున్నావా చింతించకన్న యేసు మాటలు మరిచావా మారను మధురంగా మార్చెను చూసావా !!2!! !! కన్నీరేలమ్మ కరుణించు యేసు !!
నీకెవరు లేరని... ఏంచేయలేవని... అన్నారా నిన్ను నిరాషాపరిచారా పురుగంటి వాడనని... ఎప్పటికి ఇంతేనని... నా బ్రతుకు మారదని అనుకుంటూవున్నావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా !!2!! !! కన్నీరేలమ్మ కరుణించు యేసు !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
