* Song:-" కన్నీరేలమ్మ కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా"

May 21, 2016, 03:19 PM

  • Song:-" కన్నీరేలమ్మ కరుణించు యేసు " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • కన్నీరేలమ్మ. . . . కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మ. . . . కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలత మాన్పే !!2!! యేసే తోడమ్మా !! కన్నీరేలమ్మ కరుణించు యేసు !!

  • నీకేమి లేదని... ఏమి తేలేదని... అన్నారా నిన్ను అవమానపరిచారా తల రాత ఇంతేనని... తరువాత ఏమవునని... రేపటిని గూర్చి చింతించుచున్నావా చింతించకన్న యేసు మాటలు మరిచావా మారను మధురంగా మార్చెను చూసావా !!2!! !! కన్నీరేలమ్మ కరుణించు యేసు !!

  • నీకెవరు లేరని... ఏంచేయలేవని... అన్నారా నిన్ను నిరాషాపరిచారా పురుగంటి వాడనని... ఎప్పటికి ఇంతేనని... నా బ్రతుకు మారదని అనుకుంటూవున్నావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా !!2!! !! కన్నీరేలమ్మ కరుణించు యేసు !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.