* Song:-"ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ"
Share
Song:-"ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ" ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ. . . . !! ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ !!
పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ !!2!! నన్ను కరుణించి.... ఆదరించి.... సేదదీర్చి.... నిత్య జీవమిచ్చే.... !!2!! !! ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ !!
శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ !!2!! విడనాడని.... ప్రేమది.... ఎన్నడు.... యెడబాయదు....!!2!! !! ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ !!
పావన యేసుని ప్రేమ సిలువలొ పాపిని మోసిన ప్రేమ !!2!! నాకై మరణించి.... జీవమిచ్చి.... జయమిచ్చి.... తన మహిమ నిచ్చే....!!2!!
!! ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ !!నా స్థితి జూచిన ప్రేమ నాపై జాలిని జూపిన ప్రేమ !!2!! నాకై పరుగెత్తి, కౌగలించి.... ముద్దాడి.... కన్నీటిని తుడిచే....!!2!! !! ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
