* Song:-"ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ"

Jun 08, 2016, 04:03 PM

  • Song:-"ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ" ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ. . . . !! ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ !!

  • పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ !!2!! నన్ను కరుణించి.... ఆదరించి.... సేదదీర్చి.... నిత్య జీవమిచ్చే.... !!2!! !! ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ !!

  • శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ !!2!! విడనాడని.... ప్రేమది.... ఎన్నడు.... యెడబాయదు....!!2!! !! ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ !!

  • పావన యేసుని ప్రేమ సిలువలొ పాపిని మోసిన ప్రేమ !!2!! నాకై మరణించి.... జీవమిచ్చి.... జయమిచ్చి.... తన మహిమ నిచ్చే....!!2!!
    !! ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ !!

  • నా స్థితి జూచిన ప్రేమ నాపై జాలిని జూపిన ప్రేమ !!2!! నాకై పరుగెత్తి, కౌగలించి.... ముద్దాడి.... కన్నీటిని తుడిచే....!!2!! !! ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.