* Song:- “ దేవా…. నీ కృప నిరంతరం ”
Share
Song:- “దేవా…. నీ కృప నిరంతరం” ~~~~~~~~~~~~~~~~~~~~~~*
దేవా…. నీ కృప నిరంతరం మారనిదెపుడు నా ప్రభువా నిత్యజీవము గలది ప్రియ ప్రభువా దేవా…. నీ కృప నిరంతరం….
పాపినగు నన్ను ఓ ప్రభువా పరిశుద్ధపరచెను నీ కృపయే !!2!! పరమ స్వాస్థ్యము నొందుటకు ప్రేమతో నన్ను పిలిచితివే !!2!!
!! దేవా…. నీ కృప నిరంతరం…. !!రక్షణ భాగ్యము పొందుటకు రక్షక యేసు నీ కృపయే !!2!! నిత్యము నీతో నుండుటకు నిత్య జీవము నిచ్చితివే !!2!!
!! దేవా…. నీ కృప నిరంతరం…. !!విశ్వాస జీవితం చేయుటకు విజయము నిచ్చెను నీ కృపయే !!2!! శోధన బాధలు అన్నిటిలో శక్తినొసంగి నడిపితివే !!2!! !! దేవా…. నీ కృప నిరంతరం…. !!
కృపలో నడుపుము ఓ దేవా కృపతో నింపుము నా ప్రభువా !!2!! నిత్యము కృపలో నన్ను నడిపి నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము !!2!! !! దేవా…. నీ కృప నిరంతరం…. !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
