* Song:- “ నా నీతి నీవే నా ఖ్యాతి నీవే ”

Jun 26, 2016, 04:59 PM

  • Song:- “ నా నీతి నీవే నా ఖ్యాతి నీవే ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా నా క్రియలు కాదు నీ కృపయే దేవా నా ప్రాణమా యేసయ్యా నదులంత తైలం, విస్తార బలులు నీ కిచ్చినా చాలవయ్యా నీ జీవితాన్నే నాకిచ్చినావు నీకే నా జీవమయ్యా హల్లెలుయా. . . . ఆమెన్ హల్లెలుయా. . . . !!4!! !! నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా !!

  • నాధీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా నా దోషశిక్ష భరియించి నీవు ననునీలో దాచావుగా  ఏమంత ప్రేమ నా మీద నీకు నీప్రాణమిచ్చావుగా నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను యజమానుడవు నీవేగా  హల్లెలుయా. . . . ఆమెన్ హల్లెలుయా. . . . !!4!! !! నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా !!

  • నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు నీవు చేరదీసావుగా నా ప్రక్కనిలచి నను దైర్యపరచి కన్నీరు తుడిచావుగా నేనున్న నీకు భయమేలనంటు ఓదార్పునిచ్చావుగా చాలయ్యా దేవా నీకృపయే నాకు బ్రతుకంతయు పండుగా హల్లెలుయా. . . . ఆమెన్ హల్లెలుయా. . . . !!4!! !! నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా !!

  • ఆ ఊభిలోన నే చిక్కినప్పుడు నీవు నన్నుచూసావుగా నీ చేయిచాపి నను పైకిలేపి నీవాక్కునిచ్చావుగా   నా సంకటములు నా ఋణపుగిరులు అన్నిటినితీర్చావుగా నీలోన నాకు నవజీవమిచ్చి నీ సాక్షిగా నిలిపావుగా హల్లెలుయా. . . . ఆమెన్ హల్లెలుయా. . . . !!4!! !! నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.