Song:-" గమ్యం చేరాలని నీతో ఉండాలని "

Jul 09, 2016, 02:24 PM

Song:-" గమ్యం చేరాలని నీతో ఉండాలని " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూ రేయి పరవశించాలని ఈ నింగి నేలా కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని !!2!! !! గమ్యం చేరాలని నీతో ఉండాలని !!

  • భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్ని సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో !! సాగిపోతున్నాను నిన్ను చూడాలని !! !! గమ్యం చేరాలని నీతో ఉండాలని !!

  • అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువనే మోయాలని నా గుండె కోవెలలోనా నిన్నే నే ప్రతిష్టించి నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను విడవాలని !! సాగిపోతున్నాను నిన్ను చూడాలని !! !! గమ్యం చేరాలని నీతో ఉండాలని !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.