* Song:- " నా ప్రియుడా యేసయ్యా "
Share
Song:- " నా ప్రియుడా యేసయ్యా " ~~~~~~~~~~~~~~~~~~~~~~*
నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేను క్షణమైనా.... నే బ్రతుకలేను !! నా ప్రియుడా యేసయ్యా!! నా ప్రియుడా యేసయ్యా....
నీ చేతితోనే నను లేపినావు నీ చేతిలోనే నను చెక్కుకొంటివి !!2!! నీ చేతి నీడలో నను దాచుకొంటివి !!2!! !! నా ప్రియుడా యేసయ్యా!!
నీ వాక్కులన్ని వాగ్ధానములై నీ వాక్కుపంపి స్వస్థత నిచ్చితివి !!2!! నీ వాగ్ధానములు మార్పులేనివి !!2!! !! నా ప్రియుడా యేసయ్యా!!
ముందెన్నడూ నేను వెళ్లనీ నూతనమైన మార్గములన్నిటిలో !!2!! నా తోడునీవై నన్ను నడిపినావు !!2!! !! నా ప్రియుడా యేసయ్యా!!
సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వసంపదలు నీలోనే యున్నవి !!2!! నీవు నా పక్షమై నిలచి యున్నావు !!2!! !! నా ప్రియుడా యేసయ్యా!!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
