* Song:-"వెండి బంగారాలకన్న మిన్నయైనది"
Share
Song:-"వెండి బంగారాలకన్న మిన్నయైనది" ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
వెండి బంగారాలకన్న మిన్నయైనది యేసుప్రేమ నా యేసు ప్రేమ !!2!! లోక ఙ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరూ చూపలేని ప్రేమ !!2!! యేసుప్రేమ శాశ్వతప్రేమ !!2!! హల్లెలూయా మహదానందమే !!2!!
లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ !!2!! లోకులకై కరిగిపొయిన ప్రేమా లోకాన్ని జయించిన ప్రేమ !!2!! యేసుప్రేమ శాశ్వతప్రేమ !!2!! హల్లెలూయా మహదానందమే !!2!!
ఏస్థితికైనా చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ !!2!! నీకు బదులు మరణించిన ప్రేమా చిరజీవము నీకొసగే ప్రేమ !!2!! యేసుప్రేమ శాశ్వతప్రేమ !!2!! హల్లెలూయా మహదానందమే !!2!! !! వెండి బంగారాలకన్న మిన్నయైనది !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
