* Song:- " పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా "
Share
Song:- " పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింప గలరా వరదూతలైనా నిన్ !!3!! వర్ణింప గలరా.... !! పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా !!
పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా నిరుపమ బలబుద్ధి !!3!! నీతి ప్రభావా.... !! పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా !!
పరిశుద్ధ తనయుడ నర రూప ధారుడ నరులను రక్షించు కరుణా నముద్రా నరులను రక్షించు !!3!! కరుణా నముద్రా.... !! పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా !!
పరిశుద్ధ మగు నాత్మ వరము లిడు నాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ !!3!! భక్తుల కిడుమా.... !! పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా !!
జనక కుమారాత్మ లను నేక దేవ ఘన మహిమ చెల్లును దనర నిత్యముగా ఘన మహిమ చెల్లును !!3!! దనర నిత్యముగా.... !! పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
