* Song:-“చాలునయ్యా చాలునయ్యా నీ కృప”
Share
Song:-“చాలునయ్యా చాలునయ్యా నీ కృప” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. . . . !!2!! ప్రేమామయుడివై ప్రేమించావూ. . . . కరుణామయుడివై కరుణించావూ. . . . !!2!! తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే !!2!! ప్రేమా.... కరుణా.... నీ కృపచాలు.... !!2!! !! చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు !!
జిగటగల ఉబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా !!2!! హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా.... హిమముకంటెను తెల్లగ మార్చయ్యా.... నికేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా.... నా జీవితమంతా అర్పింతుననీకయ్యా.... ప్రేమా.... కరుణా.... నీ కృపచాలు.... !!2!! !! చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు !!
బంధువులు స్నేహితులు త్రోసేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసినా !!2!! నన్ను నీవు విడువనేలేదయ్యా.... మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా.... నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా.... నీ సాక్షిగా నేను ఇల జీవింతునయ్యా.... ప్రేమా.... కరుణా.... నీ కృపచాలు.... !!2!! !! చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
