* Song:- " దేవ సంస్తుతి చేయవే మనసా "

Jul 24, 2016, 06:46 PM

  • Song:- " దేవ సంస్తుతి చేయవే మనసా " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా నా యంతరంగము లో వసించు నో సమస్తమా

  • జీవమా యెహోవా నీకు జేసిన మేళ్ళన్ మరువకు !!2!! నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును.... ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. . . .

  • చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను కృపను !!2!! జీవ కిరీటముగ వేయును నీ శిరసు మీద జీవ కిరీటముగ వేయును.... ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. . . .

  • యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలెనే క్రొత్త !!2!! యవ్వనంబై వెలయునట్లుగా మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా.... ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. . . .

  • పడమటికితూర్పెతా ఎడమో పాపములకుమనకు నంత !!2!! ఎడము కలుగజేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు.... ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. . . .

  • కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తిపరుల !!2!! యెడల జాలి పడును దేవుండు తన భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు.... ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. . . . !! దేవ సంస్తుతి చేయవే మనసా. . . . !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.