* Song:- " దేవ సంస్తుతి చేయవే మనసా "
Share
Song:- " దేవ సంస్తుతి చేయవే మనసా " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా నా యంతరంగము లో వసించు నో సమస్తమా
జీవమా యెహోవా నీకు జేసిన మేళ్ళన్ మరువకు !!2!! నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును.... ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. . . .
చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను కృపను !!2!! జీవ కిరీటముగ వేయును నీ శిరసు మీద జీవ కిరీటముగ వేయును.... ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. . . .
యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలెనే క్రొత్త !!2!! యవ్వనంబై వెలయునట్లుగా మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా.... ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. . . .
పడమటికితూర్పెతా ఎడమో పాపములకుమనకు నంత !!2!! ఎడము కలుగజేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు.... ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. . . .
కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తిపరుల !!2!! యెడల జాలి పడును దేవుండు తన భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు.... ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. . . . !! దేవ సంస్తుతి చేయవే మనసా. . . . !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
