* Song:-"చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే "

Jul 26, 2016, 07:55 PM

  • Song:-"చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే కమ్మని అమ్మవు నీవే కాచిన తండ్రివి నీవే

  • నీలా ఎవరు ప్రేమిస్తారు నాకై ప్రాణం అర్పిస్తారు కన్నీరు తుడచి కరుణిస్తారు కళ్ళార్పకుండా కాపాడతారు !! చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే !!

  • కొండలు గుట్టలు చీకటి దారులు కనిపించదే కళ్ళు చిట్లించినా. . . . కారాలు మిర్యాలు నూరేటి ప్రజలు అన్నారు పడతావక్క అడిగేసినా. . . . రక్షించేవారే లేరని.... నీపనైపోయిందని !!2!! అందరు ఒక్కటై అరచేసినా అపవాదులెన్నో నాపై మోపేసినా !!2!! నీచేయి చాచేసి చీకటిని చీల్చేసి శత్రువును కూల్చేసి నిలబెట్టినావు !! చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే !!

  • పేదోడు పిరికోడు ప్రభుసేవకోచ్చాడు అవమానపడతాడని నవ్వేసినా. . . . చిన్నొడు నీవంటు అర్హత లేదంటు అయినొల్లు కానొల్లు చెప్పేసినా. . . . నీవెంత నీబ్రతుకెంతని నిలువలేవు నీవని !!2!! అందరు ఒక్కటై తెల్చేసినా కూల్చేయలనీ నన్ను కృషి చేసినా !!2!! నీఆత్మతో నింపెసి నిరాశను కూల్చేసి నా గిన్నె నింపేసి నడిపించినావు !! చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.