* Song:- “ నిబంధనా జనులం. . . . ”

Aug 03, 2016, 06:58 PM

  • Song:- “ నిబంధనా జనులం. . . . ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • నిబంధనా జనులం.... నిరీక్షణా ధనులం ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబందులం మేము నిబంధనా జనులం.... యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరేదమూ. . . . !!2!! నిబంధనా జనులం. . . .

  • అబ్రహాము నీతికి వారసులం ఇగుప్తు దాటినా అనేకులం !!2!! మోషే బడిలో బాలురము.... !!2!! యేసయ్య వడిలో కృత్తార్ధులం.... ప్రియ పుత్రులం మేము నిబంధనా జనులం....

  • విశ్వాసమే మా వేదంతం నిరీక్షణే మా సిధంతం !!2!! వాక్యమే మా ఆహారం. . . . !!2!! ప్రార్ధనే మా వ్యాయమం.... అనుదినము మేము నిబంధనా జనులం....

  • అశేషప్రజలలో అస్తికులం అక్షయుడేసుని ముద్రికలం !!2!! పునరుత్ధానుని పత్రికలం.... !!2!! పరిశుద్ధాత్ముని గోత్రికులం.... యాత్రికులం మేము నిబంధనా జనులం....

  • నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘన నియమం.... !!2!! క్షమించుటే ఇలా మా న్యాయం.... !!2!! భరించుటే మా సౌభాగ్యం అదే.... పరమార్ధం మేము నిబంధనా జనులం....

  • క్రీస్తేసే మా భక్తికి పునాది పునరుత్ధానుడే ముక్తికి వారధి.... !!2!! పరిశుద్ధాత్ముడే మా రధసారధి.... !!2!! ప్రభుయేసే మా ప్రధాన కాపరి.... బహు నేర్పరి మేము నిబంధనా జనులం....

  • ఎవరీ యేసని అడిగేవో ఎవరోలే అని వెళ్ళేవో.... !!2!! యేసే మార్గం.... యేసే జీవం.... !!2!! యేసే సత్యం.... కాదుసౌధ్యం.... ఇదే మా సాక్షం మేము నిబంధనా జనులం. . . .

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.