* Song:-"యెహోవ నా మొర లాలించెను"

May 14, 2016, 08:45 PM

  • Song:-"యెహోవ నా మొర లాలించెను" ~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • యెహోవ నా మొర లాలించెను దన మహా దయను నను గణించెను !!2!! అహర్నిశల దీనహీనుఁడగు నా దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను !! యెహోవ నా మొర లాలించెను !!

  • అనీతి వస్త్ర మెడలించెను యే సునాథు రక్తమున ముంచెను !!2!! వినూత్న యత్నమే ద నూని యెన్నడు గనన్ వినన్ బ్రే మ నాకుఁ జూపెను !! యెహోవ నా మొర లాలించెను !!

  • విలాపములకుఁ జెవి నిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను !!2!! శిలానగము పై కిలాగి నను సుఖ కళావళుల్ మన సులోన నిలిపెను !! యెహోవ నా మొర లాలించెను !!

  • అగణ్య పాపియని త్రోయక న న్ను గూర్చి తన సుతుని దాఁ చక !!2!! తెగించి మృతి కొ ప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను !! యెహోవ నా మొర లాలించెను !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.