* Song:- “ మనసెరిగిన యేసయ్యా ”

May 24, 2016, 10:51 PM

  • Song:- “ మనసెరిగిన యేసయ్యా ” ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగానిలిచావు !!2!! హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు !!2!! మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగానిలిచావు....

  • నిర్జీవ క్రియలను విడచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా !!2!! సాహస క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు !!2!! మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగానిలిచావు....

  • వెనుకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలో నేను సోమ్మసిల్లి పోనుగా !!2!! ఆశ్చర్య క్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు !!2!! మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగానిలిచావు....

  • మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభుబల్లారాధానకు దూరము కాలేనుగా !!2!! నేల మట్టితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు !!2!! !! మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగానిలిచావు !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.