* Song:- " నేను వెళ్ళే మార్గము "

Jun 03, 2016, 06:12 PM

  • Song:- " నేను వెళ్ళే మార్గము " ~~~~~~~~~~~~~~~~~~~~~*

  • నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను !!2!! నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును

  • కడలేని కడలి తీరము - యెడమాయె కడకు నా బ్రతుకున !!2!! గురిలేని తరుణాన వేరువగా - నా దరినే నిలిచేవా నా ప్రభూ హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ఆమేన్‌. !!2!!

  • జలములలో బడి నే వెళ్ళినా - అవి నా మీద పారవు !!2!! అగ్నిలో నేను నడచినను - జ్వాలలు నను కాల్చజాలవు హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ఆమేన్‌. !!2!!

  • విశ్వాస నావ సాగుచూ - పయనించు సమయాన నా ప్రభూ !!2!! సాతాను సుడిగాలి రేపగా - నా యెదుటే నిలిచేవ నా ప్రభు హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ఆమేన్‌. !!2!!

  • నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను !!2!! హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ఆమేన్‌. !!2!!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.