* Song:-"ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా"
Share
Song:-"ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా" ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన నా.... చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన !! ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా !!
సంతోషం ఎక్కడ ఉందనీ. . . . సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ !!2!! జగమంతా వెదికాను జనులందరినడిగాను !!2!! చివరికది నీలోనే కనుగొన్నాను.... !!2!! !! ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా !!
ప్రేమనేది ఎక్కడ ఉందనీ. . . . క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ !!2!! బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను !!2!! చివరికది నీలోనే కనుగొన్నాను.... !!2!! !! ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా !!
సత్యమనేది ఎక్కడ ఉందనీ. . . . నిత్యజీవమనేది ఎచ్చట నాకు దొరికేననీ !!2!! ఎందరికో మ్రోక్కాను ఏవేవో చేసాను !!2!! చివరికది నీలోనే కనుగొన్నాను.... !!2!! !! ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
