* Song:- " సుధా మధుర కిరణాల అరుణోదయం "

Jun 25, 2016, 02:03 AM

  • Song:- " సుధా మధుర కిరణాల అరుణోదయం " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం !!2!! తెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది !!2!! !! సుధా మధుర కిరణాల అరుణోదయం !!

  • దివి రాజుగా భువికి దిగినాడని రవి రాజుగా ఇలను మిగిలాడని !!2!! నవలోక గగనాలు పిలిచాడని పరలోక భవనాలు తెరిచాడని !!2!! ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది !!2!! నినుకావగా...నిరుపేదగా...జన్మించగా...ఇల పండుగ !!2!! !! సుధా మధుర కిరణాల అరుణోదయం !!

  • లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులు !!2!! క్షమ హృదయ సహనాలు సహపాలుగా ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా !!2!! నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే !!2!! ఆ జన్మమే...ఒక మర్మము...ఆ బంధమే...అనుబంధము !!2!! !! సుధా మధుర కిరణాల అరుణోదయం !!

  • మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*

  • The Gate Of Heaven. Facebook Page

  • Always Good News.