* Song:-"చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే "
Share
Song:-"చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే కమ్మని అమ్మవు నీవే కాచిన తండ్రివి నీవే
నీలా ఎవరు ప్రేమిస్తారు నాకై ప్రాణం అర్పిస్తారు కన్నీరు తుడచి కరుణిస్తారు కళ్ళార్పకుండా కాపాడతారు !! చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే !!
కొండలు గుట్టలు చీకటి దారులు కనిపించదే కళ్ళు చిట్లించినా. . . . కారాలు మిర్యాలు నూరేటి ప్రజలు అన్నారు పడతావక్క అడిగేసినా. . . . రక్షించేవారే లేరని.... నీపనైపోయిందని !!2!! అందరు ఒక్కటై అరచేసినా అపవాదులెన్నో నాపై మోపేసినా !!2!! నీచేయి చాచేసి చీకటిని చీల్చేసి శత్రువును కూల్చేసి నిలబెట్టినావు !! చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే !!
పేదోడు పిరికోడు ప్రభుసేవకోచ్చాడు అవమానపడతాడని నవ్వేసినా. . . . చిన్నొడు నీవంటు అర్హత లేదంటు అయినొల్లు కానొల్లు చెప్పేసినా. . . . నీవెంత నీబ్రతుకెంతని నిలువలేవు నీవని !!2!! అందరు ఒక్కటై తెల్చేసినా కూల్చేయలనీ నన్ను కృషి చేసినా !!2!! నీఆత్మతో నింపెసి నిరాశను కూల్చేసి నా గిన్నె నింపేసి నడిపించినావు !! చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే !!
మరిన్ని ఆరాధనా గీతాలకై దర్శించండి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~*
The Gate Of Heaven. Facebook Page
Always Good News.
